Mirzapur The Movie
‘మిర్జాపూర్ ది మూవీ’ స్టాండలోన్ ఫిల్మ్.. కొత్త సన్నివేశాలు, ఆసక్తికరమైన మలుపులతో ఉంటుంది: హీరో దివ్యేందు శర్మ
తెలుగు ప్రేక్షకులు సిరీస్‌ను ఎంతగా సెలబ్రేట్ చేసుకున్నారో.. సినిమాను కూడా అంతే గ్రాండ్‌గా ఆదరిస్తారనే నమ్మకం ఉంది
బాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్‌లలో ఒకటైన ‘మిర్జాపూర్’ ఇప్పుడు మరింత గ్రాండ్‌గా వెండితెరపైకి రాబోతోంది. పంకజ్ త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ యాక్షన్ డ్రామా **‘మిర్జాపూర్ ది మూవీ’**పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రితేష్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్ నిర్మించారు.
సిరీస్‌లో ప్రేక్షకులకు ఎంతో చేరువైన పాత్రలతో పాటు కొత్త పాత్రలు, కొత్త సన్నివేశాలు, ఆసక్తికరమైన మలుపులతో ఈ సినిమా రూపొందింది. సెప్టెంబర్ 4న హిందీతో పాటు తెలుగు భాషలోనూ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించింది.
పంకజ్ త్రిపాఠి
హీరో పంకజ్ త్రిపాఠి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ‘మిర్జాపూర్’ వెబ్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు అదే ప్రపంచాన్ని మరింత పెద్ద స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు ట్రైలర్‌ను మీ అందరితో కలిసి ఇక్కడ చూడటం ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చింది.
నేను పోషించిన కాలీన్ భయ్యా పాత్రకు ప్రేక్షకులు ఎంతో ప్రేమ చూపించారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు నన్ను ‘కాలీన్ భయ్యా’ అని ఎంతో ఆప్యాయంగా పిలిచారు. మీరు చూపించిన ప్రేమాభిమానాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ‘మిర్జాపూర్ ది మూవీ’ కూడా తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుందని నమ్ముతున్నాను” అన్నారు.
దివ్యేందు శర్మ
దివ్యేందు శర్మ మాట్లాడుతూ.. “మిర్జాపూర్ సిరీస్‌కి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సిరీస్‌ను ఎంతో ఆదరించారు. ఈ కథలోని రియలిస్టిక్ నేచర్ సినిమాలోనూ ఉంటుంది. ప్రస్తుతం ప్రేక్షకులు చాలా పరిణతి చెందారు. తాము ఎలాంటి సినిమా చూడబోతున్నారో ముందుగానే ఒక అవగాహనతో థియేటర్లకు వస్తున్నారు.
‘మిర్జాపూర్ ది మూవీ’ పూర్తిగా స్టాండలోన్ ఫిల్మ్. సిరీస్‌లో ఒక్క ఎపిసోడ్ కూడా చూడని వారు కూడా సినిమాను థియేటర్లో ఎంజాయ్ చేయవచ్చు. క్యారెక్టర్లు అవే అయినప్పటికీ, సిట్యుయేషన్స్ మాత్రం పూర్తిగా కొత్తగా ఉంటాయి. కొత్త సన్నివేశాలు, ఆసక్తికరమైన మలుపులతో సినిమా సాగుతుంది.
సినిమా షూటింగ్ సమయంలోనే ‘మిర్జాపూర్’కు ప్రేక్షకులు ఎంతగా కనెక్ట్ అయ్యారో మాకు మరింత స్పష్టంగా అర్థమైంది. అందుకే తెలుగు ప్రేక్షకుల కోసం సినిమాను తెలుగులోకి డబ్ చేయాలని నిర్ణయించుకున్నాం. తెలుగు ఆడియన్స్ తప్పకుండా సినిమాను ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను” అన్నారు.
అలీ ఫజల్
అలీ ఫజల్ మాట్లాడుతూ.. “‘మిర్జాపూర్ ది మూవీ’ పూర్తిగా ఫ్రెష్ ఫిల్మ్. క్యారెక్టర్ల ఎసెన్స్, వాటి స్వభావం సిరీస్‌లో ఉన్నట్లుగానే ఉన్నప్పటికీ, సినిమాలో సన్నివేశాలు కొత్తగా ఉంటాయి. కథలో అనేక ఆసక్తికరమైన మలుపులు ఉంటాయి.
గుడ్డు, బీనా, బబ్లు వంటి పాత్రలు ప్రేక్షకులకు ఇప్పటికే ఎంతో పరిచయం. తెలుగు ప్రేక్షకులు ఈ క్యారెక్టర్లను ఎంతగానో ఆదరించారు. అదే ప్రేమను సినిమాకు కూడా అందిస్తారని ఆశిస్తున్నాను. ‘మిర్జాపూర్ ది మూవీ’ తెలుగు ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది” అన్నారు.
రవి కిషన్
రవి కిషన్ మాట్లాడుతూ.. “తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు ‘మద్దాలి శివారెడ్డి’ పాత్రను ఎంతగానో అభిమానించారు. తెలుగులో నేను చేసిన సినిమాలన్నీ నాకు మంచి విజయాలను అందించాయి. ఇప్పుడు ‘మిర్జాపూర్ ది మూవీ’లో బబ్బన్ యాదవ్ అనే కొత్త పాత్రలో కనిపించబోతున్నాను.
ఈ పాత్ర సిరీస్‌లో లేదు. సినిమాలో ప్రత్యేకంగా పరిచయం చేసే క్యారెక్టర్ ఇది. ‘మిర్జాపూర్’లోని ఈ పవర్ఫుల్ గ్యాంగ్, ఈ క్రేజీ ఫ్యామిలీ ప్రపంచంలో భాగం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.
ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఒక ప్రముఖ ఓటీటీ సిరీస్‌కి చెందిన ప్రపంచం తొలిసారి ఇంత పెద్ద స్థాయిలో బిగ్ స్క్రీన్‌పైకి రావడం ప్రత్యేకమైన విషయం. ప్రేక్షకులు థియేటర్లలో సినిమాను గ్రాండ్‌గా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను” అన్నారు.
జితేంద్ర కుమార్
జితేంద్ర కుమార్ మాట్లాడుతూ.. “‘మిర్జాపూర్’ సూపర్‌హిట్ వెబ్ సిరీస్. ఇప్పుడు ఆ ప్రపంచాన్ని బిగ్ స్క్రీన్‌పైకి తీసుకురావడం ఎంతో ప్రత్యేకంగా ఉంది. ముఖ్యంగా ఈ సిరీస్‌ను తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. అందుకే సినిమాను తెలుగులో డబ్ చేసి తీసుకురావడం మరింత ఆనందంగా ఉంది.
‘పంచాయత్’, ‘కోట ఫ్యాక్టరీ’ వంటి సిరీస్‌లను కూడా తెలుగు ప్రేక్షకులు ఎంతో ప్రేమించారు. ఇప్పుడు ‘మిర్జాపూర్ ది మూవీ’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాను కూడా అదే స్థాయిలో ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.
దర్శకుడు గుర్మీత్ సింగ్
దర్శకుడు గుర్మీత్ సింగ్ మాట్లాడుతూ.. “తెలుగు ప్రేక్షకులు సినిమాలను ఎంతో ప్రేమిస్తారు. థియేటర్లో సినిమాలను ఒక వేడుకలా సెలబ్రేట్ చేసుకునే సంస్కృతి ఇక్కడ ఉంది. అందుకే ‘మిర్జాపూర్ ది మూవీ’ని తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రత్యేకంగా నిర్ణయించుకున్నాం.
వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు అదే ప్రపంచాన్ని మరింత గ్రాండ్‌గా బిగ్ స్క్రీన్‌పై చూపించడం చాలా ఆనందంగా ఉంది. తెలుగులో ‘మిర్జాపూర్’కు ఇప్పటికే భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా తీసుకొస్తున్నాం. థియేటర్లలో కూడా ప్రేక్షకులు సినిమాను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారని నమ్ముతున్నాను” అన్నారు.
రసిక దుగల్
రసిక దుగల్ మాట్లాడుతూ.. “సిరీస్‌లో నేను పోషించిన పాత్రకు ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రశంసలు లభించాయి. అది చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. ‘మిర్జాపూర్ ది మూవీ’ కూడా ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుంది. తప్పకుండా అందరినీ అలరిస్తుంది” అన్నారు.
సోనాల్ చౌహాన్
సోనాల్ చౌహాన్ మాట్లాడుతూ.. “నేను ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాల్లో నటించాను. ఇక్కడ నాకు ఎప్పుడూ మంచి అనుభవమే ఎదురైంది. ఇప్పుడు ‘మిర్జాపూర్ ది మూవీ’తో హైదరాబాద్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది.
తెలుగు ప్రేక్షకులు నటీనటులపై, సినిమాలపై చూపించే ప్రేమ ప్రపంచంలో మరెక్కడా దొరకదు. వారు సినిమాలను ఎంతో మనస్ఫూర్తిగా ఆదరిస్తారు. ‘మిర్జాపూర్ ది మూవీ’కి కూడా తెలుగు ప్రేక్షకుల నుంచి అదే స్థాయిలో ప్రేమ లభిస్తుందని నమ్ముతున్నాను” అన్నారు.
శ్వేతా త్రిపాఠి
శ్వేతా త్రిపాఠి మాట్లాడుతూ.. “‘మిర్జాపూర్’ సిరీస్‌కు మీరందరూ అందించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో మీ ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. సిరీస్‌ను ఎంతగా ఎంజాయ్ చేశారో, ‘మిర్జాపూర్ ది మూవీ’ని కూడా అంతే ఉత్సాహంతో థియేటర్లలో ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.
శ్రియా
శ్రియా మాట్లాడుతూ.. “రానా గారి సినిమా కోసం నేను మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చాను. ఇప్పుడు ‘మిర్జాపూర్ ది మూవీ’తో ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. సెప్టెంబర్ 4న ఈ సినిమాను థియేటర్లలో చూసి మీ అందరూ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను” అన్నారు.
హర్షిత గౌర్
హర్షిత గౌర్ మాట్లాడుతూ.. “విశ్వక్సేన్ నటించిన ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాలో నేను నటించాను. ఆ సినిమాకు తెలుగు ప్రేక్షకులు ఎంతో ప్రేమను అందించారు. తెలుగు ప్రేక్షకులు కొత్త నటీనటులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు.
ఇప్పుడు ‘మిర్జాపూర్ ది మూవీ’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. సెప్టెంబర్ 4న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. బిగ్ స్క్రీన్‌పై సినిమాను మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.
‘మిర్జాపూర్ ది మూవీ’ సెప్టెంబర్ 4న హిందీ, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
