‘Missing Meghana’ Pre-Release Event Held Grandly; Movie Set for September 18 Release
ఘనంగా ‘మిస్సింగ్ మేఘన’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 18న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్
ఫస్ట్ కాపి మూవీస్, కేడి & కో బ్యానర్స్‌పై పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. వాచస్పతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ విడుదల చేయగా, ఫస్ట్ సింగిల్‌ను నిర్మాత సురేష్ బాబు ఆవిష్కరించారు. శామ్. కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ఆర్.ఆర్. ధ్రువన్ సంగీతం సమకూర్చారు.
సెప్టెంబర్ 18న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దామోదర్ ప్రసాద్ హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీనివాస్ గోపిశెట్టి
‘తంత్ర’ చిత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి మాట్లాడుతూ, “నా స్నేహితుడు వాసు సినిమా వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది. నరేష్ గారు నిర్మాతగా, నా స్నేహితుడు వాసు దర్శకుడిగా చేస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలి. సెప్టెంబర్ 18న విడుదల కానున్న ఈ చిత్రం అందరికీ మంచి పేరు, విజయాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
ధనుష్ రఘుముద్రి
నటుడు ధనుష్ రఘుముద్రి మాట్లాడుతూ, “ఫస్ట్ కాపీస్ బ్యానర్ ద్వారానే నేను పరిచయం అయ్యాను. నాకు గుర్తింపు ఇచ్చిన ఈ బ్యానర్‌పై వస్తున్న ‘మిస్సింగ్ మేఘన’ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మా ‘తంత్ర’ సినిమాకు పనిచేసిన పలువురు ఈ చిత్రానికి కూడా పనిచేశారు. సెప్టెంబర్ 18న ఈ సినిమాను మిస్ కాకుండా అందరూ చూడాలని కోరుకుంటున్నాను” అన్నారు.
సింగర్ సాకేత్
సింగర్ సాకేత్ మాట్లాడుతూ, “ఈ సినిమాను సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారికి ధన్యవాదాలు. సినిమాలోని పాటలు, విజువల్స్ చూశాను. పాటలు, సంగీతం, విజువల్స్ చాలా బాగున్నాయి. సినిమాకు మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికీ థాంక్స్” అన్నారు.
గోపరాజు రమణ
నటుడు గోపరాజు రమణ మాట్లాడుతూ, “ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన తేజ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మంచి కుటుంబ కథను ఎంచుకుని అందులో అన్ని జానర్లను మేళవించిన వాచస్పతి గారికి అభినందనలు. సినిమాను ఆసక్తికరమైన మలుపులతో తెరకెక్కించారు. ప్రేక్షకులు సెప్టెంబర్ 18న థియేటర్లలో సినిమా చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
ఆర్.ఆర్. ధ్రువన్
సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధ్రువన్ మాట్లాడుతూ, “‘మిస్సింగ్ మేఘన’ గురించి విన్నప్పుడు ఈ సినిమాకు సంగీతం అందించడం నాకు కొత్తగా అనిపించింది. సినిమాకు మంచి పాటలు అందించాలని ప్రయత్నించాను. దర్శకుడు, చిత్రబృందం సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ చిత్రానికి పనిచేసిన అందరితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. బెక్కం వేణు గోపాల్ గారు సినిమాకు ఎంతో సపోర్ట్ చేశారు. అలరాజు గారు మంచి పాటలు అందించారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
బెక్కం వేణు గోపాల్
బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ, “నరేష్ గారు నిర్మించిన తర్వాత ఈ సినిమాను చూశాను. సినిమా చూసిన వెంటనే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అందుకే సినిమాకు సపోర్ట్ చేయాలని అనిపించింది. సెప్టెంబర్ 18న చిత్రం విడుదల కానుంది. అందరూ ఈ సినిమాకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నరేష్, వాచస్పతికి ఈ సినిమాతో మంచి విజయం రావాలి. అంకిత్, రామ్ కార్తీక్ అద్భుతంగా నటించారు. ధ్రువన్ మంచి సంగీతం అందించారు” అన్నారు.
దర్శకుడు వాచస్పతి
చిత్ర దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ, “ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ప్రధాన కారణం కథ. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన చిత్రబృందం మొత్తానికి కృతజ్ఞతలు. సెప్టెంబర్ 18న విడుదల కానున్న ‘మిస్సింగ్ మేఘన’కు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే మంచి ప్రమోషన్స్‌తో సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తున్నాం” అన్నారు.
రామ్ కార్తీక్
నటుడు రామ్ కార్తీక్ మాట్లాడుతూ, “నా తొలి చిత్రం నుంచి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దామోదర్ ప్రసాద్ గారితో నాకు మంచి పరిచయం ఉంది. ఆయనకు సినిమాపై ఎంతో ప్యాషన్ ఉంది. ధ్రువన్ అందించిన పాటలు సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. పాటలు పాడిన గాయకులకు ధన్యవాదాలు.
గతంలో కలిసి పనిచేయలేకపోయిన పలువురితో ఈ సినిమాలో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా అనిపించింది. బెక్కం వేణు గోపాల్ గారు నాకు మంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు. అంకిత్‌తో కలిసి పనిచేయడం చాలా బాగా అనిపించింది. అమ్ము అభిరామితో ఇది నా రెండో సినిమా. దర్శకుడు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేశారు. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సెప్టెంబర్ 18న ‘మిస్సింగ్ మేఘన’ను అందరూ థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
అంకిత్ కొయ్య
నటుడు అంకిత్ కొయ్య మాట్లాడుతూ, “సంవత్సరం తర్వాత మీడియా ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు. నేను ఈ రోజు ఇక్కడ ఉండటానికి ప్రధాన కారణం దర్శకుడు వాచస్పతి గారు. ఆయన ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేశారు. సినిమాకు పనిచేసిన మొత్తం బృందానికి, నిర్మాతలకు ధన్యవాదాలు. రామ్ కార్తీక్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా అనిపించింది. మీడియా తలుచుకుంటే ఒక సినిమాకు ఎంతటి మద్దతు ఇవ్వగలదో నా గత సినిమాల విషయంలో చూశాను. ‘మిస్సింగ్ మేఘన’కు కూడా మీడియా మంచి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.
దామోదర్ ప్రసాద్
ముఖ్య అతిథిగా హాజరైన దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ, “నేను ఈ సినిమాకు సపోర్ట్ చేయడానికి ప్రధాన కారణం రామ్ కార్తీక్. ఈ సినిమాకు పనిచేసిన పలువురు నాతో గతంలో కలిసి పనిచేశారు. వారిలో మంచి ప్రతిభ ఉంది.
ఒక నిర్మాతకు కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం. సినిమా విడుదల తేదీ వరకు నిర్మాత గట్టిగా నిలబడాలి. సినిమా అంటే కేవలం డబ్బు కాదు.. కొంతమంది జీవితాలు దానితో ముడిపడి ఉంటాయి. ఎలాంటి కష్టం వచ్చినా సినిమా కోసం నిలబడాలి. చిన్న సినిమాలకు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి.
సెప్టెంబర్ 18న విడుదల కానున్న కంటెంట్ ఉన్న ‘మిస్సింగ్ మేఘన’కు మీడియా నుంచి మంచి మద్దతు లభించి, సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
సెప్టెంబర్ 18న ‘మిస్సింగ్ మేఘన’ థియేటర్లలో విడుదల కానుండటంతో చిత్రబృందం విజయంపై నమ్మకంతో ఉంది.
