Sudigali Sudheer’s G.O.A.T Arrives in Theatres on November 12
సుడిగాలి సుధీర్ G.O.A.T నవంబర్ 12న విడుదల
ఏషియన్ సినిమాస్ సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం.. హీరోయిన్గా దివ్య భారతి
ప్రముఖ కమెడియన్ నుంచి హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ నటిస్తున్న తాజా చిత్రం G.O.A.T (Greatest of All Time). వేధవ్యాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దివ్య భారతి కథానాయికగా నటిస్తున్నారు.
మహా తేజ క్రియేషన్స్, జైష్ణవ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని చంద్రశేఖర్ రెడ్డి మొగుల్ల నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. తాజాగా చిత్రబృందం G.O.A.T చిత్రాన్ని నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. విడుదల తేదీ ఖరారు కావడంతో ప్రస్తుతం మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్‌తో సినిమా కథ, పాత్రలు, వినోదం, కమర్షియల్ అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి మొగుల్ల మాట్లాడుతూ.. “ప్రస్తుతం సినిమా నిర్మాణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బడ్జెట్ విషయంలో, నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీపడకుండా భారీ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నాం. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో G.O.A.T తెరకెక్కుతోంది. ఈ సినిమా సుడిగాలి సుధీర్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని నమ్ముతున్నాం. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా, విజువల్‌గా అద్భుతంగా ఉండేలా రూపొందిస్తున్నాం.
G.O.A.Tలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కమర్షియల్ అంశాలతో పాటు, నేటి యువత ఆలోచించేలా చేసే ఒక మంచి సందేశం కూడా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది” అని తెలిపారు.
ఈ చిత్రంలో సుడిగాలి సుధీర్, దివ్య భారతి, సర్వధమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, బ్రహ్మాజీ, పృథ్వీ, ఆడుకలం నరేన్, రాజేంద్రన్, ఆనంద్ రామరాజు, చమ్మక్ చంద్ర, పమ్మీ సాయి, నవీన్ నేని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
