‘Mugguru Kothulu’ ‘Thiduthunna Koduthunna’ Love Song Released by Anup Rubens
అనూప్ రూబెన్స్ చేతుల మీదుగా ‘ముగ్గురు కోతులు’ నుంచి ‘తిడుతున్నా కొడుతున్నా’ లవ్ సాంగ్ రిలీజ్
జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్వర్క్స్ సహ సమర్పణలో శోభారాణి గరిమెల్ల నిర్మిస్తున్న చిత్రం ‘ముగ్గురు కోతులు’. కార్తీక్ గరిమెల్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, వర్షిక పాశం కథానాయికగా కనిపించనున్నారు.
ఇప్పటికే ‘ముగ్గురు కోతులు’ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇటీవల విడుదలైన టైటిల్ సాంగ్‌కు కూడా మంచి స్పందన లభించింది. ఈ క్రమంలో తాజాగా చిత్రబృందం మరో ఆసక్తికరమైన అప్డేట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. సినిమాలోని ప్రేమ గీతం ‘తిడుతున్నా కొడుతున్నా’ను ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ విడుదల చేశారు.
పాటను విడుదల చేసిన అనంతరం అనూప్ రూబెన్స్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్. సుహాస్ స్వరపరిచిన ఈ పాటకు జగదీష్ సాహిత్యం అందించారు. చైతన్య, లాస్య ఆలపించిన ఈ గీతం వినసొంపైన మెలోడీతో ఆకట్టుకునేలా ఉంది.
‘తిడుతున్నా కొడుతున్నా’ లిరికల్ వీడియోను పరిశీలిస్తే హీరో, హీరోయిన్ మధ్య సాగే ప్రేమకథ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తోంది. ఆహ్లాదకరమైన విజువల్స్‌తో పాటు పాటలోని రొమాంటిక్ ఫీల్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
ప్రస్తుతం ‘ముగ్గురు కోతులు’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రానికి ఎస్. సుహాస్ సంగీతం అందిస్తుండగా, రాజ్ నోముల సినిమాటోగ్రాఫర్‌గా, జమీర్ షేక్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సినిమా నుంచి రాబోయే మరిన్ని అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని విశేషాలతో త్వరలోనే చిత్రబృందం ప్రేక్షకుల ముందుకు రానుంది.
