Romanchakam Pre Release
సందీప్ వంగా మీద నాకున్న ప్రేమను మాటల్లో చెప్పలేను: విజయ్ దేవరకొండ
సుమంత్ ప్రభాస్‌లో సినిమా పట్ల ఒక డ్రీమ్ చూశా.. ‘రోమాంచకం’ ప్రీమియర్స్ నుంచే ఘన విజయం సాధిస్తుంది
సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్
బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘రోమాంచకం’. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అంశాలను మేళవిస్తూ రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఏషియన్ సినిమాస్ ద్వారా సునీల్ నారంగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘రోమాంచకం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి తన శుభాకాంక్షలు తెలిపారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ
“సందీప్‌పై నాకున్న ప్రేమను మాటల్లో చెప్పలేను. అది దర్శకుడు, హీరో మధ్య ఉండే బంధం కాదు. బ్రదర్స్ మధ్య ఉండే బంధం కాదు. స్నేహితుల మధ్య ఉండే బాండింగ్ కూడా కాదు. మా బంధం అంతకుమించింది.
‘అర్జున్ రెడ్డి’ సమయంలో మేమిద్దరం ఒక యుద్ధంలాంటి ప్రయత్నం చేశాం. ఆ సినిమా వర్కవుట్ కాకపోతే ఏమయ్యేదో ఊహించలేకపోయాం. అప్పుడు మాకు డబ్బు లేదు, పేరు లేదు, ఇన్ఫ్లుయెన్స్ లేదు. ‘పెళ్లిచూపులు’ కూడా అప్పటికి రిలీజ్ కాలేదు. అభిమానులైన మీరు కూడా మా వెనుక లేరు. అయినా జస్ట్ ధైర్యంగా అడుగేశాం.
‘అర్జున్ రెడ్డి’ సినిమా వల్ల వచ్చిన సక్సెస్ మాత్రమే కాదు.. సందీప్‌తో కలిసి షేర్ చేసుకున్న ఎన్నో అనుభవాలు, మూవ్మెంట్స్ నా జీవితంలో చాలా ప్రత్యేకమైనవి. జీవితం గురించి మేము మాట్లాడుకున్న ఎన్నో సందర్భాలు ఉన్నాయి.
డబ్బు లేని సమయంలో సందీప్ వాళ్ల బ్రదర్ ప్రణయ్, ఫాదర్‌తో కలిసి పొలం అమ్మి, నాపై నమ్మకంతో ‘అర్జున్ రెడ్డి’ సినిమా చేశారు. వాళ్ల కుటుంబ సంపాదన మొత్తాన్ని ఒక సినిమాపై ఇన్వెస్ట్ చేశారు. సందీప్ కోసం నేను ఎక్కడిదాకా అయినా వెళ్తా. నాకోసం సందీప్ కూడా ఎక్కడిదాకా అయినా వస్తాడు.
సందీప్ పిలిచాక నేను ఈ ఫంక్షన్‌కు రాకపోతే నేను బతికి ఎందుకు అన్నంత ప్రేమ మా మధ్య ఉంది.
సుమంత్ ప్రభాస్‌ను చూసినప్పుడు ఆయన కళ్లలో సినిమా పట్ల ఒక డ్రీమ్ కనిపించింది. అప్పుడే అనుకున్నా.. సుమంత్ ఏదో ఒక రోజు యాక్టర్ లేదా డైరెక్టర్ అవుతాడని. ఆ రోజు వచ్చినప్పుడు మనం చేయగలిగినంత ఇతనికి చేయాలని అప్పుడే అనుకున్నా. ‘మేమ్ ఫేమస్’ సినిమాకు కూడా నా వంతు ప్రమోషన్ చేశాను.
భద్రకాళీ లోగో పడుతుంటే ‘అర్జున్ రెడ్డి’ సౌండ్ వినిపిస్తుంటుంది. సందీప్ అన్న, ప్రణయ్ అన్న కలిసి ఒక సినిమా చేస్తున్నారంటే అది తప్పకుండా మంచి సినిమా అవుతుంది. ‘రోమాంచకం’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా.
సందీప్, ప్రణయ్‌తో పాటు ఈ కొత్త టీమ్ అందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలి. వాసుకి కంపోజ్ చేసిన ‘రాధారమణ’ పాట ఆనంద్‌కు చాలా ఇష్టం. రోజూ వింటుంటాడు.
సెప్టెంబర్ 2న ప్రీమియర్స్‌తోనే ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా. సినిమాకు వర్క్ చేస్తున్నప్పుడు మనం ఎంత ఎంజాయ్ చేశామన్నది ముఖ్యం. సక్సెస్ ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది. మనపై మనకు నమ్మకం ఉండి, విజయం సాధించాలనే తపన ఉంటే తప్పకుండా విజయం దక్కుతుంది.”
సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ
“డైరెక్టర్ వేణుగోపాల్ ఈ కథ చెప్పినప్పుడు చాలా నవ్వుకున్నాను. అయితే కథ చెప్పినంత బాగా సినిమా తీస్తావా అని అడిగాను. ఆయన ఆరు నిమిషాల నిడివి ఉన్న ఒక సీన్ తీసుకుని వచ్చి చూపించారు. స్క్రిప్ట్‌లో ఉన్నదానికంటే ఇంకా బాగా ఆ సీన్ తెరకెక్కించారనిపించింది. అప్పటి నుంచి ఈ సినిమా బాధ్యత మొత్తాన్ని వేణుకే అప్పగించాను. నేను ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు.
మెయిన్ లీడ్ కాబట్టి హీరో అనే ఫీల్ సహజంగానే ఉంటుంది. కానీ సుమంత్ ప్రభాస్ అలాంటిదేమీ కనిపించకుండా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అందరితో కలిసిపోయి అద్భుతంగా నటించాడు. అతనిది అమాయకమైన క్యారెక్టర్. ఆ పాత్రలో చాలా బాగా నటించాడు.
అనంతిక పర్ఫార్మెన్స్ రియల్లీ గుడ్. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్‌లో నటించిన వాళ్లంతా సూపర్బ్‌గా చేశారు. మ్యూజిక్ కోసం వాసుకిని తీసుకున్నప్పుడు ఒక నమ్మకంతో తీసుకున్నాం. పాటలు, మ్యూజిక్ విన్న తర్వాత మా నమ్మకం నిజమైందనిపించింది.
సెప్టెంబర్ 3న సినిమా రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్ 2 నుంచే ప్రీమియర్స్ వేస్తున్నాం. డైరెక్టర్ వేణుగోపాల్ కల నిజమయ్యే రోజు సెప్టెంబర్ 3. ఆ రోజు ఆయన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుంది. నాకు, విజయ్‌కు ‘అర్జున్ రెడ్డి’ రిలీజైన ఆగస్టు 24 ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటి రోజు వేణుకు కూడా రావాలని కోరుకుంటున్నా.
ఈ సినిమా కోసం టీమ్ అంతా చాలా కష్టపడ్డారు. సినిమా అంతా గట్టిగా నవ్వుకుంటారు. ఈ సినిమా కోసం మీరు వెచ్చించే డబ్బు, సమయం ఏమాత్రం వృథా కాదు. మళ్లీ సినిమా చూడాలనిపించేలా ఫన్ సీన్స్ కూడా ఉన్నాయి.”
ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ
“సుమంత్ ప్రభాస్ బయట ఎలా సరదాగా ఉంటాడో మా సినిమాలోని క్యారెక్టర్లో కూడా అలాగే కనిపిస్తాడు. ఆయన పర్సనాలిటీ మా క్యారెక్టర్‌కు దాదాపు 70 శాతం సరిపోతుంది. అనంతిక చాలా ప్రతిభ గల హీరోయిన్. మా మూవీలో అద్భుతంగా పర్ఫార్మ్ చేసింది.
ఫ్రెండ్స్ బ్యాచ్‌గా నటించిన నరేంద్ర, రవి, వెంకటేష్, మణి.. బయట ఫ్రెండ్స్ బ్యాచ్‌ను చూసినట్టే అనిపిస్తారు. వీరిలో నరేంద్ర, రవికి ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అవుతుంది.
కొత్త వాళ్లైనా మా టెక్నీషియన్స్ అందరూ అద్భుతంగా వర్క్ చేశారు. వేణుగోపాల్ విజన్‌ను నమ్మి ప్యాషన్‌తో పనిచేశారు. వాసుకి సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. పవన్ డీవోపీగా అమేజింగ్ వర్క్ చేశారు.
వేణుగోపాల్ ప్రొడ్యూసర్-ఫ్రెండ్లీ డైరెక్టర్. చెప్పిన బడ్జెట్లోనే సినిమా పూర్తి చేశారు. వేణుతో పాటు టీమ్‌లోని చాలా మందికి ఈ సినిమాతో మంచి అవకాశాలు వస్తాయని నమ్ముతున్నాను.
‘రోమాంచకం’ చాలా బాగా వచ్చింది. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి సెప్టెంబర్ 3న థియేటర్స్‌కు వెళ్లి సినిమా చూడండి. ఇది కుటుంబ సభ్యులతో కలిసి హ్యాపీగా చూసే క్లీన్ ఎంటర్టైనర్.”
డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ
“‘కబీర్ సింగ్’ తర్వాత సందీప్ అన్నతో నా జర్నీ మొదలైంది. ఆయనకు కథ చెప్పిన పది నిమిషాల్లోనే నెక్ట్స్ ఎలా ఉండబోతుందో చెప్పేస్తారు.
ప్రణయ్ అన్న, సందీప్ అన్న ఇద్దరికీ మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. ఈ కథ వారికి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకంతో వెళ్లి చెప్పాను. నాకు వాళ్లు ఇచ్చిన ఫ్రీడమ్ చూసి చాలా మంది అసూయపడుతున్నారు.
సందీప్ అన్న నాకు ఒకటే విషయం చెప్పారు – ‘నీ సినిమా, నీ విజన్. జస్ట్ డూ ఇట్.’ నా కథపై, క్యారెక్టర్స్‌పై, నాపై ఆయన పూర్తిగా నమ్మకం పెట్టుకున్నారు.
కాలేజ్‌లో ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలమనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ కాలేజ్ నుంచి బయటకు వచ్చాక రియాలిటీ తెలుస్తుంది. ఆ సందర్భాన్ని నా కథలో చెప్పాను. ఆ సందిగ్ధ పరిస్థితిని సహజంగా, అందంగా నా తరహాలో సినిమాగా తెరకెక్కించాను.
మేము ఫ్రెష్ రైటింగ్, ఫ్రెష్ పర్ఫార్మెన్స్తో ఈ సినిమా చేశాం. ‘మేమ్ ఫేమస్’లోని ఒక చిన్న సీన్ చూసి సుమంత్‌ను తీసుకున్నాను. ఆయనలో ఎంతో ప్రతిభ ఉంది. ఈ మూవీలో తన క్యారెక్టర్‌ను సూపర్బ్‌గా పర్ఫార్మ్ చేశారు.
‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ అన్నను ఫిలింమేకర్స్ ఎలా చూశారో, ఈ సినిమా తర్వాత సుమంత్ ప్రభాస్‌ను కూడా అలా చూస్తారని నమ్ముతున్నాను.
అనంతిక మోస్ట్ టాలెంటెడ్, మోస్ట్ బ్యూటిఫుల్. ఆమె అద్భుతంగా నటించింది. నేను దాదాపు 99 శాతం కొత్త వాళ్లతోనే సినిమా చేశాను. నా విజన్‌ను నమ్మాను. ఈ సినిమా కొత్తగా ఉంటుంది. కొత్త తరహా పర్ఫార్మెన్స్లను మీరు చూడబోతున్నారు. ‘రోమాంచకం’ ఫ్రెష్ ఫీల్‌తో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.”
హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ
“విజయ్ అన్న, సందీప్ అన్న ‘అర్జున్ రెడ్డి’తో ప్రేక్షకులకు ఇచ్చిన ఫీవర్ మామూలుది కాదు. ఆ సినిమా మాపై ఎంతో ఇంపాక్ట్ చూపించింది. విజయ్ అన్న, తరుణ్ భాస్కర్ అన్న ‘పెళ్లిచూపులు’ చూసిన తర్వాత మనం కూడా సినిమాల్లో ప్రయత్నించవచ్చు అనే నమ్మకం కలిగింది.
‘మేమ్ ఫేమస్’ సినిమా చేసినప్పుడు దానికి సపోర్ట్ చేస్తూ విజయ్ అన్న చేసిన ప్రమోషన్ ఇప్పటికీ అందరికీ గుర్తుంది. ఆయన ఇచ్చిన ఆ బూస్ట్ ఇంకా మాలో ఉత్సాహం నింపుతోంది.
సందీప్ అన్న ఈ సినిమా కథ గురించి చెప్పి ‘విను అన్న’ అన్నప్పటి నుంచి, భద్రకాళీ ఆఫీస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి నా జీవితంలో ప్రతిరోజూ రోమాంచకమే.
అర్జున్ రెడ్డి తర్వాత దేశమంతా మన వాళ్లైన సందీప్, విజయ్ అన్న గురించి తెలుసుకున్నారు. ఈ రోజు వాళ్ల బ్యానర్లో సినిమా చేస్తుంటే నాకూ పెద్ద హీరో కావాలనిపిస్తోంది. అందుకు ఈ సినిమా మెట్టుగా మారాలి.
ఈ సినిమా మిమ్మల్ని ఎంత ఎంటర్టైన్ చేస్తుందో, ఎంత నవ్విస్తుందో నేను ఊహించగలను. క్యారెక్టర్స్‌లో ఉండే ఫన్, స్వీట్నెస్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి.
సెప్టెంబర్ 3న ఈ క్యూట్ ఫీల్ మీకు రెండున్నర గంటల పాటు నాన్‌స్టాప్‌గా ఉంటుంది. ఇదొక క్యూట్ ఫన్ ఫిల్మ్. ఫ్యామిలీతో వెళ్లినా, ఫ్రెండ్స్‌తో వెళ్లినా ఎంజాయ్ చేస్తారు.”
హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ మాట్లాడుతూ
“మా ‘రోమాంచకం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా వచ్చిన విజయ్ గారికి థ్యాంక్స్. ఈ రోమాంచకం జర్నీలో పార్ట్ కావడం చాలా సంతోషంగా ఉంది.
మా ప్రొడ్యూసర్స్ సందీప్, ప్రణయ్ గారికి, మా డైరెక్టర్ వేణుగోపాల్ గారికి థ్యాంక్స్. ఈ టీమ్‌తో ఎంతో సరదాగా, సంతోషంగా వర్క్ చేశాను. ప్రతి రోజూ మా అందరిలో రోమాంచకం ఫీల్ ఉండేది.
డీవోపీ పవన్, మ్యూజిక్ డైరెక్టర్ వాసుకి బెస్ట్ ఔట్పుట్ ఇచ్చారు. సెప్టెంబర్ 3న మా సినిమా రిలీజ్ అవుతోంది. మీరంతా థియేటర్స్‌కు వెళ్లి సినిమా చూడాలని కోరుకుంటున్నా. ‘రోమాంచకం’ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితో కలిసి చూసి ఎంజాయ్ చేసే ఎంటర్టైనర్.”
ఇతర చిత్ర బృంద సభ్యుల మాటల్లో..
యాక్టర్ కమల్: భద్రకాళీ పిక్చర్స్ నుంచి ఈ సినిమా కోసం కాల్ రావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, సందీప్ వంగా తాను పెద్ద అభిమానినని తెలిపారు. ఈ చిత్రం టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
యాక్టర్ సతీష్: ఈ చిత్రంలో హీరో తండ్రి పాత్రలో నటించానని, డైరెక్టర్ వేణుగోపాల్ ఇచ్చిన అవకాశం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ‘రోమాంచకం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా అలరిస్తుందని చెప్పారు.
కాస్ట్యూమ్ డిజైనర్ కీర్తన: సినిమాలో కొత్త తరహా కాస్ట్యూమ్ డిజైన్స్‌ను ప్రయత్నించానని, ఈ సినిమా తమ అందరి జీవితాల్లో ఒక ప్రత్యేకమైన ‘రోమాంచకం మూవ్మెంట్’ తీసుకొచ్చిందని తెలిపారు.
నటి మానస: హీరో తల్లి పాత్రలో నటించానని, ప్రతి ఒక్కరూ ‘మా సినిమా’ అనే ఫీలింగ్‌తో పనిచేశారని చెప్పారు. సుమంత్, అనంతిక అద్భుతమైన ప్రతిభ కలిగిన నటులని ప్రశంసించారు.
యాక్టర్ సోహాన్: ‘అర్జున్ రెడ్డి’ చూసిన తర్వాత థ్రిల్ ఫీలయ్యానని, అదే సంస్థలో నటుడిగా అరంగేట్రం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. సినిమాలో ప్రేమ, హాస్యం, ఉత్కంఠ సరైన మోతాదులో ఉంటాయని చెప్పారు.
యాక్టర్ మణి: సుమంత్, వెంకటేష్, తాము బయట ఎలా సరదాగా ఉంటామో సినిమాలో కూడా అదే ఫన్ రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పారు. ‘రోమాంచకం’ టీమ్ అందరికీ మంచి పేరు తీసుకొస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
యాక్టర్ నరేంద్ర: ఈ సినిమా కోసం దాదాపు ఆరు నెలలు రిహార్సల్స్ చేశామని తెలిపారు. టీమ్‌తో కలిసి పనిచేసిన రోజులను మిస్ అవుతున్నానని, ‘రోమాంచకం’ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఎంగేజ్ చేస్తుందని అన్నారు.
డీవోపీ పవన్ పప్పుల: దాదాపు ఏడాది పాటు ఈ సినిమాపై పనిచేశానని, ఈ అనుభవం ఎంతో ప్రత్యేకమని తెలిపారు. ఫ్రెండ్స్, గ్యాంగ్‌తో కలిసి థియేటర్స్‌లో సినిమాను ఎంజాయ్ చేయాలని కోరారు.
మ్యూజిక్ డైరెక్టర్ వాసుకి వైభవ్: సందీప్ రెడ్డి వంగా నుంచి ఈ సినిమాకు పనిచేయమని కాల్ రావడం నమ్మలేని అనుభూతి అని తెలిపారు. ఈ సినిమాను ఒక అవకాశంగా మాత్రమే కాకుండా బాధ్యతగా భావించి వంద శాతం ఎఫర్ట్ పెట్టానని చెప్పారు. ‘రోమాంచకం’ తనకు మంచి విజిటింగ్ కార్డ్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కొరియోగ్రాఫర్ గోవింద్ మాస్టర్: ఈ సినిమాలో మూడు పాటలకు కొరియోగ్రఫీ చేశానని, పాటల్లోని స్టెప్స్ చాలా సహజంగా ఉండేలా డిజైన్ చేశామని తెలిపారు. దర్శకుడు వేణుగోపాల్ సహకారం ఎంతో ఉందని చెప్పారు.
డైరెక్టర్ మెహర్ రమేష్: ప్రణయ్, సందీప్ తనకు సోదరుల్లాంటి వారని తెలిపారు. ‘స్పిరిట్’ వంటి భారీ చిత్రంతో బిజీగా ఉన్నప్పటికీ కొత్తవారిని ప్రోత్సహిస్తూ ‘రోమాంచకం’ వంటి సినిమాను నిర్మించడం అభినందనీయమన్నారు. సుమంత్ ప్రభాస్ మంచి పర్ఫార్మర్ అని వింటున్నానని, సినిమా పాటలు, కంటెంట్ బాగున్నాయని ప్రశంసించారు.
డైరెక్టర్ శౌర్యువ్: సుమంత్ ప్రభాస్ చాలా ప్రతిభావంతమైన నటుడని, ఈ సినిమాతో విజయ్ దేవరకొండలా స్టార్ కావాలని ఆకాంక్షించారు. కొత్తవారిని ప్రోత్సహిస్తున్న సందీప్, ప్రణయ్‌లను అభినందించారు. దర్శకుడు వేణుగోపాల్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఆల్ ది బెస్ట్ కాకుండా కంగ్రాట్స్ చెప్పాలనిపిస్తోందన్నారు.
లిరిక్ రైటర్ చంద్రబోస్: ‘రోమాంచకం’ సరదాగా సాగే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ అయినప్పటికీ, ఇందులో అర్థవంతమైన మాటలు, పాటలు రాసే సందర్భాలు ఉన్నాయని తెలిపారు. సరదా కథలోనూ డెప్త్ ఉన్న సాహిత్యాన్ని రాసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు.
సెప్టెంబర్ 3న థియేటర్లలో ‘రోమాంచకం’
యూత్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్, ప్రేమ, హాస్యం, ఉత్కంఠతో రూపొందిన ‘రోమాంచకం’పై చిత్ర బృందం భారీ అంచనాలు పెట్టుకుంది. ప్రీమియర్స్ నుంచే సినిమాకు మంచి స్పందన వస్తుందని హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సహా చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.
సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానున్న ‘రోమాంచకం’ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
